Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు తీపి కబురు.. రాజీవ్‌ యువ వికాసంపై సర్కారు కీలక ప్రకటన

1 month ago 10
Bhatti Vikramarka on Rajiv Yuva Vikasam: తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని నవంబరులో ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన చేపట్టి అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.450 కోట్ల ఫీజులు, ఉపకార వేతనాలు జమ చేసినట్లు వెల్లడించారు. కాటమయ్య రక్షణ కవచాలు, బీసీ గురుకులాలు, విదేశీ విద్య పథకాల పురోగతిని సమీక్షించారు. బీసీ విదేశీ విద్య దరఖాస్తుల గడువును అక్టోబరు 15 వరకు పొడిగించారు.
Read Entire Article