Ongole Ysrcp Leader Prasanna Selfie Video Suicide Attempt: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఈ నెల 8న నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో తన కాళ్లు తొక్కారని ప్రశ్నించడంతో కొందరు వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని ప్రసన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.