Madhapur OYO Death: ఓయో రూంలో యువతి అనుమానాస్పద మృతి.. పరారీలో ప్రియుడు, ఏం జరిగింది..?

1 month ago 15
Madhapur OYO Woman Suspicious Death: మాదాపూర్‌ సిద్దిఖీనగర్‌లోని ఓయో హోటల్‌ రూమ్‌ 303లో విశాఖకు చెందిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి ఆమె హోటల్‌కు వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ముఖం, తలపై గాయాలు, గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిళ్లు లభించాయి. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. ఆసుపత్రి నుంచి పరారైన ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article