KCR వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.. కష్ట కాలంలో కడుపు నింపింది: జబర్దస్త్ ఆర్టిస్ట్

1 week ago 8
జబర్దస్త్‌ కామెడీ షోతో గుర్తింపు పొందిన రాజమౌళి ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించడం వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం లభించిందని ఆయన తెలిపారు. తన భార్య సలహాతో స్థిరమైన ఉపాధికి ప్రాధాన్యమిచ్చి ఉద్యోగంలో చేరానని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరోనా సమయంలో టీవీ షోలు, ఈవెంట్లు నిలిచిపోయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే తన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పాటలు, ఆటల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article