Kancharapalem 50 Years School: 50 ఏళ్లుగా ఉన్న స్కూల్ ఎలా మూసేస్తారు?

1 year ago 35
విశాఖపట్నంలోని కంచరపాలెం పాఠశాల మూసివేత అంశం వివాదాస్పదమైంది. పాఠశాల మూసివేత నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు హైవేపై ఆందోళన చేశారు. ఉన్నఫలంగా విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించేశారని తల్లిదండ్రులు ఆరోపించారు, ఇందేంటని అడగడానికి వెళ్తే స్కూల్‌లో ఒక్క టీచర్ కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్లు చేసుకున్న పిల్లలను కూడా పక్క స్కూల్‌కి పంపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా ఉన్న స్కూల్‌ని ఎలా మూసేస్తారంటూ నిలదీశారు. తల్లిదండ్రుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించి వేశారు.
Read Entire Article