వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన అబ్బాయి, అనంతపురానికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిసి అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా మందలించారు. అమ్మాయి తరఫు వాళ్లు మందలించారని అబ్బాయి వాళ్ల ఇంట్లో చెబితే వాళ్లు కూడా తిట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత అమ్మాయికి వివాహం చేశారు. అయితే, కట్టుకున్నోడు బాధ పెడుతున్నాడంటూ ప్రియుడికి ప్రియురాలు చెప్పింది. తన ప్రియురాలిని సరిగా చూసుకోవడం లేదన్న మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.