HYD: ఇంటి నిర్మాణం 300 గజాలపైన ఉన్న ఓనర్లకు మంత్రి పిలుపు.. కారణం ఇదే..

1 year ago 29
తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, రాబోయే వానలకు సంబంధించి హైదరాబాద్‌లోని జలమండలితో సమీక్షించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రమైన నీటి పంపిణీకి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీటి నిల్వ స్థలాల పర్యవేక్షణ.. "డ్రై డే" అమలు, ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరని చెప్పారు. జలమండలి ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవాలని, నీటి వృధాను తగ్గించాలని, అక్రమ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి ఫేజ్ 2,3 ప్రాజెక్టులు, 39 ఎస్టీపీల నిర్మాణంతో భవిష్యత్ నీటి అవసరాలకు భరోసా లభిస్తుందని తెలిపారు.
Read Entire Article