Cyclone Arnab Live: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్.. అతి తీవ్ర తుఫాన్ లైవ్ అప్డేట్స్

1 week ago 10
అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ అతి తీవ్ర తుఫాన్.. విశాఖపట్నం, బాపట్ల మధ్య యానాం దగ్గర్లో బుధవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతోపాటు భీకరమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తుఫాన్ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు రైళ్లను సైతం రద్దు చేశారు. అర్నబ్ తుఫాన్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఈ లైవ్ బ్లాగ్ ద్వారా అందిస్తాం.
Read Entire Article