Allu Sirish Loud Music: అర్ధరాత్రి వరకు హనుమాన్‌ ఆలయంలో లౌడ్‌స్పీకర్లతో శబ్దం.. పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు

1 month ago 15
Hero Allu Sirish on Temple Loud Music: హైదరాబాద్‌లోని వినోభానగర్‌ హనుమాన్‌ ఆలయం వద్ద అర్ధరాత్రి 2, 3 గంటల వరకు పెద్ద శబ్దంతో సంగీతం వినిపిస్తోందంటూ హీరో అల్లు శిరీష్‌ హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేశ్‌ నిమజ్జనాల కారణంగా సెప్టెంబర్‌ 25 వరకు వేచి ఉండాలని ఫిలింనగర్‌ పోలీసులు సూచించినట్లు తెలిపారు. పండుగ ముగిసినా శబ్దం ఆగలేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఆయన సినిమాలను బహిష్కరిస్తారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read Entire Article