Adilabad RIMS fire accident: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పిల్లల వార్డులో పేలిన ఏసీ, పసికందు మృతి

1 month ago 13
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్‌ఎన్‌సీయూ వార్డులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలింది. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో వార్డులో మెుత్తం 27 మంది పిల్లలకు చికిత్స అందిస్తుండగా.. తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి వారిని బయటకు తీసుకొచ్చారు. అయితే పొగ ఊపిరితిత్తుల్లోకి చేరటంతో ఓ చిన్నారి మృతి చెందగా.. మిగిలిన 26 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్ తరలించారు. వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Read Entire Article