Adilabad IT Tower: హైదరాబాద్ దాటి జిల్లాలకు ఐటీ విస్తరణ.. ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ రెడీ, కొత్తగా 2 వేల ఉద్యోగాలు

1 month ago 11
Telangana IT Towers: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకూ విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రూ.60 కోట్లతో అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మించగా.. అది ప్రారంభానికి రెడీ అయింది. మూడు ఐటీ సంస్థలు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకోగా.. స్టార్టప్‌లు కూడా ప్లగ్‌ అండ్‌ప్లే సదుపాయాలపై ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు 2 వేల మంది యువతకు ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న ఈ టవర్ ద్వారా స్థానికంగా టెక్నాలజీ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ టవర్లు, హబ్‌లు అందుబాటులోకి రాగా.. యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ అవకాశాలు పెరుగుతున్నాయి.
Read Entire Article