36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు: పవన్ కళ్యాణ్

3 hours ago 2
36 ఏళ్ల విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. కుటుంబంలో ఒకరికి స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందిస్తామని తెలిపారు. వైద్య ఖర్చులన్నీ ప్లాంట్ యాజమాన్యమే భరిస్తుందన్న డిప్యూటీ సీఎం.. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై బొకారో స్టీల్ ప్లాంట్‌కి చెందిన త్రిసభ్య కమిటీతో దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. త్రిసభ్య కమిటీ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Entire Article